50 పరుగులకే కుప్పకూలీన శ్రీలంక జట్టు

అమరావతి: భార‌త బౌల‌ర్ల ధాటికి శ్రీలంక 15.2 ఓవ‌ర్ల‌లో 50 ప‌రుగుల‌కే ఆలౌటైంది.. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ను ఏడోసారి గెల్చుకునేందుకు టీమిండియా మరో అడుగుదూరంలో నిలిచింది.. ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత బౌలర్లు విజృంభించారు.. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంకేయులను కేవలం 50 పరుగులకే ఆలౌట్‌ చేశారు.. లంక బ్యాట‌ర్ల‌లో కుశాల్ మెండీస్ (17), దుషన్ హేమంత (13) మాత్ర‌మే రెండు అంకెల స్కోర్లు చేశారు. ఐదుగురు బ్యాట‌ర్లు డ‌కౌట్ అయ్యారు.. భార‌త బౌల‌ర్ల‌లో సిరాజ్ ఆరు వికెట్లతో లంక ప‌త‌నాన్ని శాసించ‌గా హార్దిక్ పాండ్య మూడు, బుమ్రా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.. టీమ్ఇండియా పేస‌ర్ల ధాటికి లంక బ్యాట‌ర్లు విల‌విల‌లాడుతున్నారు.. క్రీజులో కుదురుకోలేక పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు..హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో (12.3వ ఓవ‌ర్‌)లో దునిత్‌ వెల్లలాగే(8) కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.. దీంతో లంక 40 ప‌రుగుల‌కే 8 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది.

Power Of News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *