జమ్మూకశ్మీర్ లో తొలిసారి రంగంలోకి దిగనున్న కోబ్రా కమాండోలు
అమరావతి: జమ్మూకశ్మీర్చలో తీవ్రవాదులను పూర్తిగా తుదముట్టించేందుకు CRPF అత్యున్నత దళమైన కోబ్రా(COBRA) యూనిట్ ను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా రంగలోకి దించుతోంది..ఇందుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు పలు కథనాలను వెల్లడించాయి..వామపక్ష ఉగ్రవాదంపై కూడా పోరాడటంలో ఈ కోబ్రా యూనిట్స్ కు అపార అనుభవం కలిగిఉంది..గతంలో కోబ్రా యునిట్ దళం బిహార్, ఝార్ఖండ్ లో విధులు నిర్వహించింది..ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లోని కుప్వాపాలో ఏప్రిల్ లో ఈ దళం శిక్షణ కోసం అక్కడికి వచ్చింది..అప్పటి నుంచి వారు అక్కడే కొనసాగుతున్నారు..అయితే ఇప్పటి వరకు దళానికి ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు.. అడవుల్లోని ప్రత్యేకమైన గెరిల్లా యుద్ధతంత్రం కోసం కోబ్రా (ది కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ దళాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది..కోబ్ర కమాండోలను శిక్షణ సమయంలోనే మానసికంగా, శారీరకంగా అత్యంత కఠినంగా తయారు చేస్తారు..కోబ్ర దళాలు ఎక్కువగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నాయి..మరికొన్ని దళాలు మాత్రం ఈశాన్య భారత్ లో వేర్పాటు వాదంను తుడిపెట్టేందుకు పనిచేస్తున్నాయి..జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ లో సోమవారం ఉదయం నుంచి ఎలాంటి కాల్పులు జరగకపోవడంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.. భద్రతా దళాలకు జరిగినటువంటి ప్రాణనష్టానికి తాము కచ్చితంగా ప్రతీకారం తీర్చుకొంటామని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హెచ్చరించారు..ఉగ్రనాయకులు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు..భద్రతా దళాలపై తమకు పూర్తిగా విశ్వాసం ఉందని,,దేశం మొత్తం వారి వెంటే ఉందని మనోజ్ సిన్హా తెలిపారు..జమ్మూకశ్మీర్ లో సామాన్యులను భద్రత కల్పిస్తూ ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపే సమయం వచ్చిందని స్పష్టం చేశారు.