ప్రణాళికలు,ఆశయాలు,ఆకాంక్షల మధ్య కొత్త పార్లమెంట్ భవన్ లో సమావేశాలు ప్రారంభం
అమరావతి: దేశానికి స్వాతంత్ర్య సిద్దించిన తరువాత పార్లమెంట్ వేదికగా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు,, సంఘటనలకు వేదికైన పాత పార్లమెంటు భవనం,,నేటి నుంచి ఒక చరిత్రగా మారిపోయింది..ఎన్నో ప్రణాళికలు,, ఆశలు,,ఆకాంక్షల మధ్య కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి.. పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్ లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి జాతీయ గీతం ఆలపించారు..సమావేశానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాంగణంలోని ఎంపీలందరితో సమావేశమయ్యారు..ఈ సంవత్సరం మే నెలలో నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.. ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు సోనియా కూర్చునే పోడియం వద్దకు వెళ్లి వారితో కాసేపు ప్రధాని మోదీ మాట్లాడారు.