ప్రారంభంమైన జియో ఎయిర్ ఫైబర్ సర్వీస్
అమరావతి: రిలయన్స్ జియో వినాయక చవితి సందర్భంగా మంగళవారం జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) సర్వీస్ ను రిలయన్స్ జియో ఇన్పోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ లాంఛనంగా ప్రారంభించాడు..గత నెల 28వ తేదిన జరిగిన రిలయన్స్ వార్షిక వాటాదారుల సమావేశంలో జియో ఎయిర్ ఫైబర్ తీసుకొస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించింది..తొలుత దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా, పుణె నగరాల్లో Jio Air Fiber సేవలు అందుబాటులో ఉంటాయి.. Installations చార్జీల కింద రూ.1000 చెల్లించాలి.. జియో అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి Connection తీసుకోవాలి అనుకునే వారు రూ.100 పే చేసి జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) బుక్ చేసుకోవచ్చు..మిగిలిన మొత్తం బిల్లులో సర్దుబాటు చేస్తారు..జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) కనెక్షన్ తోపాటు లేటెస్ట్ వై-ఫై రూటర్, టీవీ అండ్ వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్ కోసం 4కే సెట్ టాప్ బాక్స్ ఇస్తారు..అన్ని రకాల ప్లాన్లు ఆరు నెలలు,,12 నెలల ఆప్షన్లలో లభిస్తాయి..ఒకవేళ మీరు 12 నెలల ప్లాన్ ఎంచుకుంటే రూ.1000 Installations చార్జీలో పూర్తి రాయితీ ఇస్తారు,,దేశంలో ఏ ప్రాంతంలోనైనా జియో ఎయిర్ ఫైబర్ పోర్టబిలిటీ లభిస్తుంది..కానీ ఆ ప్రాంతంలో 5జీ కనెక్టివిటీ ఉండాలి..బ్రాడ్ బాండ్ తరహాలో జియో ఎయిర్ ఫైబర్ స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది.
జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్లు:- రూ.599 ప్లాన్ లో 30 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్, డిస్నీ+ హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్ట్స్ తదిత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వీక్షించొచ్చు..రూ.899 ప్లాన్ లో 100 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అదనం..రూ.1199 ప్లాన్ కింద నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో కార్యక్రమాలు చూడొచ్చు..జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ క్యాటగిరిలో రూ.1499 ప్లాన్ మీద 300 Mbps ఇంటర్నెట్ వేగంతోపాటు జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్లన్నీ చూడవచ్చు. రూ.2499 ప్లాన్ కింద 500 Mbps స్పీడ్, రూ.3999-1 Gbps స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది..అయితే ఈ ప్లాన్లపై అదనంగా GST పే చేయాల్సి ఉంటుంది.