హీరో విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్య

అమరావతి: “విధి” ఒక దాని తరువాత మరో కష్టలకు గురి చేస్తు ఎప్పుడు మనిషి జీవితంతో అడుకుంటునే వుంటుంది..అలాంటి కష్టలు ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదురైవుతునే వుంటాయి..వాటిని తట్టుకుని నిలబడితేనే,,మనిషి జీవితం ముందుకు సాగుతుంది..ఇలాంటి సంఘటనే బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల దగ్గరైన మ్యూజిక్ కంపోసర్,,హీరో విజయ్ ఆంటోని జీవితంలో పెను విషాదం రూపంలో చోటు చేసుకుంది..ఆయన కూమారై మీరా ఆత్మహత్య చేసుకుంది..మంగళవారం వేకువజామున చెన్నైలోని తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని తనువు చాలించింది..కుటుంబ సభ్యులు ఆమ్మాయిని ఆసుపత్రికి తరలించినప్పటికి ప్రయోజం లేకపోయింది..ఈ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు..ఇంత చిన్న వయసులోనే కూతురు మరణించడంతో విజయ్ ఆంటోని కుటుంబ, విషాదంలో మునిగిపోయింది..ఈ హృదయ విదారక సంఘటన విజయ్ కుంటుబానే కాదు,, మొత్తం సినిమా ఇండస్ట్రీని షాక్కు గురిచేసింది..శరత్ కుమార్, రాఘవ లారెన్స్, వెంకట్ ప్రభు తదితర సినీ నటులు మీరా మృతికి సంతాపం తెలుపుతున్నారు..మీరా హఠాన్మరణానికి ఇంకా కారణం తెలియాల్సి ఉంది..ప్రస్తుతం మీరా చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్లో +2 చదువుతోంది..చదువుల కారణంగా మీరా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతోందని,, చికిత్స కూడా తీసుకుంటుందని సన్నిహితులు పేర్కొంటున్నారు..మీరా ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే కారణమా ?.. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది..విజయ్ ఆంటోని ఇంట్లో ఇలా ఆత్మహత్యలు జరగడం ఇదేమి మొదటిసారి కాదు..గతంలో విజయ్ ఆంటోనీ తండ్రి కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకున్నాడు..అప్పుడు విజయ్ ఆంటోనీ వయసు 7 సంవత్సరాలు..ఒక సందర్భంలో తన తండ్రి ఆత్మహత్యపై స్పందించిన విజయ్,,ఎంతో స్ఫూర్తి కలిగించే వ్యాఖ్యలు చేశాడు.. “జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. ఇంట్లో ఎవరైనా ఇలా చనిపోతే వారి పిల్లల గురించి తలుచుకుంటే మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది.. మా నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడు..అప్పుడు నా వయసు ఏడు సంవత్సరాలు..మా చెల్లికి ఐదేళ్లు..నాన్న ఆత్మహత్య మా వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది..నాన్న చనిపోయిన తరువాత మమ్మల్ని పోషించడానికి అమ్మ చాలా కష్టపడింది..అందుకే ఆత్మహత్యలు గురించి విన్నప్పుడల్లా చాలా బాధేస్తోంది..నేను జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను..ఎన్నో ఇబ్బందులు పడ్డాను..అయితే ఆత్మహత్య గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదు” అంటూ ఉద్వేగం మాట్లాడారు.

Power Of News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *