చెత్త రహిత నెల్లూరు” సాకారానికి కృషిచేయండి- కమిషనర్ వికాస్ మర్మత్
నెల్లూరు: కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA), స్వచ్ఛ్ భారత్ మిషన్ (SBM) లు సంయుక్తంగా “చెత్త రహిత నగరం (గార్బేజ్ ఫ్రీ సిటీ)” వైపు ప్రజలను ప్రేరేపించడానికి ప్రయత్నాలను ప్రారంభించాయని, స్వచ్ఛ నెల్లూరు సాకారానికి నగర ప్రజలంతా సహకరించాలని కమిషనర్ వికాస్ మర్మత్ కోరారు..కమిషనర్ నేతృత్వంలో ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2.0 (ISL 2.0)& సఫాయి సురక్ష సివిర్ కార్యక్రమాన్ని ఆదివారం 7 గంటలకు స్థానిక బారాషాహీదు ప్రాంగణం పరిసరాల స్వచ్ఛతే లక్ష్యంగా నిర్వహించారు..కార్యక్రమంలో భాగంగా కమిషనర్ నేతృత్వంలో స్వర్ణాల చెరువు, బరాషాహీదు ప్రాంగణంలోని వ్యర్ధాలను తొలగించి స్వచ్ఛతను ప్రకటించారు..కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరూ స్థానికంగా ఏర్పాటు చేసిన QR కోడ్ ని స్కాన్ చేసుకుని స్వచ్ఛత లీగ్ నందు వోటింగ్ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు..ఈ కార్యక్రమంలో స్వచ్ఛత లీగ్ బ్రాండ్ అంబాసిడర్, అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ కొమ్మెర్ల తులసి, నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు, ఇండోర్/ఔట్ డోర్ సిబ్బంది, సచివాలయ సెక్రెటరీలు, ఫిట్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు.