A.P-T.GNATIONAL

మహిళకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు అమోదం

నారీ శక్తి వందన్ అభియాన్..
అమరావతి: మూడ దశాబ్దాలుగా పెడింగ్ వున్న మహిళకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ప్రధాని నరేంద్రమోదీ పట్టుదలతో ఎట్టకేలకు బుధవారం ఆమోద ముద్ర పడింది..నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును మంగళవారం లోక సభలో ప్రవేశపెట్టింది..మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏడున్నర గంటలపాటు చర్చ కొనసాగింది..ఈ బిల్లుకు 454 ఓట్లు అనుకూలంగా రాగా, రెండు ఓట్లు వ్యతిరేకంగా వచ్చినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ మంగళవారమే ఆమోదం తెలిపింది..ఈ బిల్లుకు విపక్ష పార్టీల నుంచి కూడా మద్దతు దక్కగా,,ఎంఐఎం మాత్రమే మద్దతు తెలపలేదు..లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర పడడంతో ఇది రాజ్యసభ అమోదం కోసం వెళ్లనుంది..కొత్త పార్లమెంటు భవనంలో ఆమోదం పొందిన తొలి బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లే..లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందడంతో పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు..లోకసభ,,రాజ్యసభలో ప్రస్తుతం దాదాపు 80 మంది మహిళలే వున్నారు..మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు అమోదం పొందడంతో,,ఈ సంఖ్య దాదాపు 180కి చేరానున్నది..

Power Of News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *