జగన్ నాలుగేళ్ల పాలన అంతా అవినీతిమయమ-అమిత్ షా
మోదీ ఇస్తున్న పథకాలకు జగన్ పేరు పెట్టకుంటారా?
అమరావతి: ముఖ్యమంత్రిగా జగన్ నాలుగేళ్ల పాలన అంతా అవినీతిమయమని,,ఏ.పి మైనింగ్, మాఫియా, గంజాయికి అడ్డాగా మారిందని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు..శనివారం ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా విశాఖలోని రైల్వేగ్రౌండ్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ అమిత్ షా మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానంలో ఉందని విమర్శలు చేశారు..అన్నదాతల ఆత్మహత్యలు ఆడ్డుకొలేని ముఖ్యమంత్రి సిగ్గుపడాలన్నారు.. కేంద్రం ఇస్తున్న ఇళ్లకు జగన్ పేరు పెట్టుకున్నారని అలాగే ప్రధాని మోదీ ఇస్తున్న ఉచిత బియ్యం పథకానికి కూడా జగన్ ఫొటో పెట్టుకుంటున్నరని దుయ్యబట్టారు..వైసీపీ వచ్చాక విశాఖ నగరం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని మండిపడ్డారు..పదేళ్లలో ఏపీ అభివృద్ధికి రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని,,అమరావతి, విశాఖ, కాకినాడ, తిరుపతిని స్మార్ట్ సిటీలు చేస్తున్నామని అమిత్ షా ప్రకటించారు..
కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది… మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన ఒక్క అవినీతి ఆరోపణపైనా చర్యలు తీసుకోలేదని చెప్పారు.. పుల్వామా దాడి ఘటన జరిగిన 10 రోజుల్లోనే సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా పాక్ కు బుద్ధి చెప్పామన్నారు.. 70 కోట్ల మంది పేదలకు అనేక పథకాలు అమలు చేయడంతో పాటు రైతులకు ఏటా రూ.6 వేలు సాయం అందిస్తున్నమన్నారు.. కేంద్ర పథకాలకు జగన్ తన పేరు చెప్పుకుంటున్నారు. ప్రపంచంలోని అనేక వేదికలపైన భారతదేశ ప్రతిష్ఠను ప్రధాని మోదీ పెంచారని,,ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోదీ పేరునే పలుకుతున్నాయన్నారు..ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం అయిందని హోం మంత్రి చెప్పారు..