అనంత్ నాగ్ జాయింట్ టెర్రర్ ఆపరేషన్లో లష్కరే తోయిబా కమాండర్ హతం
అమరావతి: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం అనంత్ నాగ్ జిల్లాలోని గారోల్ అడవుల్లో గతవారం రోజుల నుంచి జరుగుతున్న జాయింట్ యాంటీ టెర్రర్ ఆపరేషన్ పూర్తి అయిందని,,మరి కొందరు ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అదనపు డీజీపీ విజయ్ కుమార్ మంగళవారం మీడియాకు తెలిపారు..సోమవారం జరిగిన కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని “లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్”గా గుర్తించామని డీజీపీ వెల్లడించారు..మరో ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నమని తెలిపారు..హతం అయిన వీరే కాకుండా మరో ముగ్గురు ఉగ్రవాదుల గురించి తమకు సమాచారం ఉందని,,అటవీ ప్రాంతంలో వారు చిక్కుకున్నట్లు తెలుస్తోందని,,వారి కదలికలపై నిఘా పెంచుతామన్నారు..ఉగ్రవాదులు లైవ్ గ్రెనేడ్లు వాడే అవకాశం ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లకూడదని సూచించారు.. గత వారం కల్నల్ మన్ ప్రీత్ సింగ్,,19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ ఆశిష్ ధోంచక్,, జమ్మూ కశ్మీర్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయున్ భట్ లను ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఉగ్రవాదుల కోసం సర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది..