అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ వాయిదా
అమరావతి: చంద్రబాబుపై FIR కొట్టేయాలని అయన తరపున లాయర్లు కోర్టును అభ్యర్దించారు.. యాంటీ కరప్షన్ యాక్ట్ సెక్షన్-13 IPC 409 చెల్లవని క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్నారు.. సాక్ష్యాలు లేకున్నప్పటికి, రాజకీయ ప్రతికారంతోనే కేసు పెట్టారని పిటిషన్‌లో చంద్రబాబు లాయర్లు వివరించారు..కేసుకు సంబంధించి అన్ని ఆధారాలతోనే రిపోర్టు అందచేశామని సీఐడీ తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు..దింతో అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తామని చంద్రబాబు లాయర్లకు కోర్టు తెలిపింది..ఇందుకు స్పందించిన చంద్రబాబు అడ్వకేట్, లూథ్రా తనకు ఎలాంటి అభ్యంతరాల్లేవని తెలిపారు..చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ కోర్టు తీర్పుపై జరిపిన ఈ విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈనెల 18 తేది వరకు దానిపై ఎలాంటి విచారణ చేపట్టవద్దని,, చంద్రబాబును వచ్చేసోమవారం వరకు కస్టడీకి తీసుకోవద్దని సీఐడీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది..చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ,, ఇవ్వ వద్దని బాబు తరఫు లాయర్లు న్యాయమూర్తిని కోరారు..ఇరువైపు వాదనలు విన్న తరువాత కోర్టు పైవిధంగా ఆదేశాలు జారీచేసింది..అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 19వ తేదికి విచారణ వాయిదా పడింది.